హైదరాబాద్లో జయలలిత నివాసం సీజ్.. రూ.83 లక్షల పన్ను బకాయిలు
హైదరాబాద్, మార్చి 31:
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు.
2017 నుంచి సుమారు రూ.83 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో జీ+4 భవనాన్ని సోమవారం సీజ్ చేశారు.
ఈ భవనాన్ని నివాసంగా మార్చాలని జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ గతంలో అధికారులను కోరినట్లు సమాచారం.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
