రూ. 15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్.ఐ

రాజన్న సిరిసిల్ల జిల్లా : అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. ఇసుక లారీని విడిపించేందుకు లంచం డిమాండ్ చేసిన సబ్-ఇన్స్పెక్టర్ ఇప్పుడు కటకటాలపాలయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మాజీ ఎస్.హెచ్.ఓ, ప్రస్తుతం సబ్-ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వెర్లగొండ వెంకటేశ్వర్లు మార్చి 23న ఏసీబీ అధికారులకు చిక్కారు. ఫిర్యాదుదారునికి చెందిన ఇసుక లారీని వదిలిపెట్టడానికి వెంకటేశ్వర్లు రూ. 15,000 లంచం డిమాండ్ చేశారు.
విశేషమేమిటంటే, ఈ లంచం మొత్తాన్ని నేరుగా కాకుండా పి.సి 2963 సత్యనారాయణ ద్వారా యూపీఐ (UPI) పేమెంట్ రూపంలో స్వీకరించారు. దీనిపై ఫిబ్రవరి 28న నమోదైన కేసు ఆధారంగా లోతైన విచారణ జరిపిన ఏసీబీ అధికారులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
