మత్తు స్ప్రే చల్లి పుస్తెలతాడు అపహరణ
జమ్మికుంట మండలం మడిపల్లిలో దారుణం
పిండి గిర్ని వద్ద ఒంటరిగా ఉన్న మహిళే లక్ష్యంగా దోపిడీ

జమ్మికుంట , మార్చి 24 (Zindagi9News) :
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో దొంగతనం ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కస్తూరి రమ ఇంటి వద్ద పిండి గిర్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నది.
మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఆమె ఇంటికి వచ్చాడు. పిండి పడతారా అని అడగగా, రమ అవును అని చెప్పిన వెంటనే ఆ వ్యక్తి ఆమె ముఖంపై మత్తు స్ప్రే కొట్టాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది.
ఆమె అపస్మారక స్థితిలో ఉండగా దుండగుడు మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించి పరారయ్యాడు. దాని విలువ సుమారు రూ.60,000గా అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
🔹 ప్రజలకు హెచ్చరిక:
ఇలాంటి ఘటనల నేపథ్యంలో అపరిచితులపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
