యుద్ధ విరమణకు ఇరాన్ 3 షరతులు: అమెరికా, ఇజ్రాయెల్‌కు మాసౌద్ పెజెష్కియాన్ అల్టిమేటం!

టెహ్రాన్: పశ్చిమాసియాలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు స్వస్తి పలికేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధమని ప్రకటిస్తూనే, అందుకు ప్రధానంగా మూడు షరతులను ఇరాన్ అధ్యక్షుడు మాసౌద్ పెజెష్కియాన్ విధించారు.
ఇరాన్ పెట్టిన 3 ప్రధాన షరతులు ఇవే:
చట్టబద్ధమైన హక్కుల గుర్తింపు: అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ యొక్క చట్టబద్ధమైన హక్కులను తక్షణమే గుర్తించాలి.
యుద్ధ నష్టపరిహారం: ప్రస్తుత యుద్ధం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి తగిన పరిహారం చెల్లించాలి.
భద్రతా హామీ: భవిష్యత్తులో తమ దేశంపై ఎలాంటి దాడులు జరగకుండా అంతర్జాతీయ స్థాయిలో గట్టి హామీ ఇవ్వాలి.
ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ హెచ్చరిక
మరోవైపు, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలన్నీ ఖాళీ చేయాల్సిందేనని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని, శత్రువుల నుంచి నష్టపరిహారం వసూలు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ సలహాదారు అలీ ఫదావీ మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్‌లపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
