
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక: అభ్యర్థుల రాకతో ఉత్కంఠ
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల అభ్యర్థులు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. హుజురాబాద్ ఏసిపి మాధవి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంలో 12 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అలాగే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా మున్సిపాలిటీకి చేరుకున్నారు. వారిలో ములుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) కూడా ఉన్నారు.చైర్మన్ పదవికి ఎవరు ఎన్నికవుతారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
