

జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికలు 2026: 79.81% పోలింగ్ నమోదు
జమ్మికుంట మున్సిపాలిటీలో జరిగిన 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పోలింగ్లో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదైన అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం 79.81% పోలింగ్ నమోదైంది.
సమయానుసారం పోలింగ్ శాతం వివరాలు:
• ఉదయం 9 గంటలకు – 7.74%
• ఉదయం 11 గంటలకు – 24.89%
• మధ్యాహ్నం 1 గంటకు – 47.35%
• మధ్యాహ్నం 3 గంటలకు – 65.52%
• సాయంత్రం 5 గంటలకు – 79.81%
మొత్తం ఓటర్ల సంఖ్య 34,455.
• పురుషులు – 16,815
• మహిళలు – 17,639
• ఇతరులు – 1
మొత్తం పోలైన ఓట్లు 27,498.
• పురుషులు – 13,421
• మహిళలు – 14,076
• ఇతరులు – 1
లింగాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది:
• పురుషులు – 79.82%
• మహిళలు – 79.80%
• మొత్తం – 79.81%
కొన్ని వార్డుల్లో 85 శాతం పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా Ward-1, Ward-7, Ward-11, Ward-13, Ward-14 ప్రాంతాల్లో అధిక ఓటింగ్ నమోదైంది.ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తయినట్లు సమాచారం.
