
అందరి చూపు తిరుపతి వైపే.. “ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా”
— 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతి
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న చొప్పరి తిరుపతి, “ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా” అంటూ ఓటర్లను అభ్యర్థించారు. బిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఆయన శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించి, కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఇస్త్రీ పెట్ట పట్టుకుని వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన తిరుపతి, ప్రజల ఆదరణతో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా మంగళహారతులతో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, గెలిపిస్తే వార్డు అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
