
మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ వార్తలు ఫేక్ : తెలంగాణ పోలీసులు స్పష్టం
హైదరాబాద్, ఫిబ్రవరి 7(zindagi9news ): మేడారం జాతర సందర్భంగా బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని కొన్ని పత్రికలు, యూట్యూబ్ ఛానెళ్లలో ప్రచారం జరిగిన వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టం చేసింది.ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పష్టీకరణ విడుదల చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని, వాస్తవ ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు.అలాగే ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కూడా స్పష్టత ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. తప్పుడు వార్తల ప్రచారం వల్ల రాష్ట్ర ప్రతిష్టకు, పోలీస్ శాఖ మానసిక స్థైర్యానికి భంగం కలుగుతుందని హెచ్చరించారు.కాగా, కొద్ది రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, పత్రికల్లో ఈ తప్పుడు వార్తలు వ్యాప్తి చెందడంతో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే పోలీస్ శాఖతో పాటు జాతీయ మహిళా కమిషన్ ధృవీకరణతో ఈ వార్తలు ఫేక్ న్యూస్ అని నిర్ధారణ అయ్యింది.ప్రజలు విశ్వసనీయ వనరుల నుంచి మాత్రమే సమాచారం పొందాలని, ఎలాంటి ధృవీకరణ లేకుండా తప్పుడు వార్తలను షేర్ చేయవద్దని తెలంగాణ పోలీసులు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
