121 మున్సిపాలిటీల్లో 38 బీసీ స్థానాలు: రిజర్వేషన్లు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం




హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ పాలనలో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల పదవులకు సంబంధించి రిజర్వేషన్ వివరాలను ప్రకటించింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 121 మున్సిపాలిటీల్లో
38 స్థానాలు (31.4%) బీసీలకు,
17 స్థానాలు ఎస్సీలకు,
5 స్థానాలు ఎస్టీలకు
కేటాయించబడినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మిగిలిన స్థానాలు జనరల్ కేటగిరీకి కేటాయించనున్నట్లు వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ నిర్ణయంతో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
