
సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు సన్మానం
కరీంనగర్ కలెక్టరేట్లో ఈరోజు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పదిమంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పీజీ సీఆర్టీ ఫిజిక్స్ ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న నీలోఫర్ సుల్తానాను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. అశ్విని తనాజీ వకాడే ఆధ్వర్యంలో, జీసీడీఓ కృపారాణి సమక్షంలో ఆమెకు సన్మానం అందజేశారు.
ఈ సందర్భంగా జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సుప్రియతో పాటు పాఠశాల సిబ్బంది నీలోఫర్ సుల్తానాను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. విద్యారంగంలో మహిళా ఉపాధ్యాయుల కృషిని గుర్తించే ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని వారు అభిప్రాయపడ్డారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
