
కరీంనగర్ జిల్లా సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం – ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా ఓసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ నగరంలోని కమాన్ రోడ్డులో ఉన్న శుభమంగళం ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్స్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర అత్యంత కీలకమని, గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుండేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌పై ఉంటుందని ఆయన అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, అవసరమైన వేళల్లో అందుబాటులో ఉండి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కన్న కృష్ణ, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, రెడ్డి జేఏసీ రాష్ట్ర నాయకులు పెండ్యాల రామ్ రెడ్డి, రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి, ఆర్బీవీఆర్ కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, పింగిలి రవీందర్ రెడ్డి, రెడ్డి జేఏసీ అధ్యక్షులు జున్నుతుల రాజిరెడ్డి, రెడ్డి ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి, గౌరవాధ్యక్షులు కాంతాల సత్యనారాయణ రెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి, గోగురు బాపురెడ్డి, ధ్యావ భాస్కర్ రెడ్డి, సమ్మిరెడ్డి, కోస్నా వేణుగోపాల్ రెడ్డి, భూపెల్లి రాఘవరెడ్డి, రేకులపల్లి రవీందర్ రెడ్డి, కాసర్ల మధుకర్ రెడ్డి, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, గన్ను మహేశ్వర్ రెడ్డి, బేతి రాజిరెడ్డి, కర్ర అశోక్ రెడ్డి, కాటం సంపత్ రెడ్డి, కొండల్ రెడ్డి, పుల్లారెడ్డి, కంట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
