
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ACB సోదాలు
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం ACB అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. కార్యాలయ తలుపులు మూసివేసి, లోపల సిబ్బందిని ఉంచి రికార్డుల పరిశీలన చేపట్టారు.
మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ACB అధికారులు రంగంలోకి దిగారు. అందిన సమాచారంతో సంబంధిత శాఖలకు చెందిన ఫైళ్లు, బిల్లులు, వర్క్ ఆర్డర్లు, చెల్లింపుల వివరాలు తదితర కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.ప్రాథమిక తనిఖీల్లో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో రికార్డుల పరిశీలన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
