
వరంగల్లో దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ
వరంగల్ లో ఈనెల 27, 28 తేదీల్లో కాళ్లు లేని దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకులు నరహరి ఐఏఎస్ ఆదేశాల మేరకు, ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.ఈ శిబిరానికి భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయ సమితి (హైదరాబాద్) సహకారం అందిస్తోంది. జైపూర్ టెక్నాలజీతో తయారుచేసిన నాణ్యమైన కృత్రిమ కాళ్లను నిపుణుల ద్వారా ఉచితంగా అమర్చనున్నారు.ఈ శిబిరం కొత్తవాడ ఎం.వి. కాలనీ, వరంగల్ లో నిర్వహించబడనుంది. అవసరమైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్ తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
