“మీ ఫొటో చూశారా?” లింక్ ప్రమాదం… వాట్సాప్‌లో కొత్త మోసం వెలుగులోకి

వాట్సాప్‌లో కొత్త మోసం… ‘ఘోస్ట్ పేయిరింగ్’తో జాగ్రత్త!
“హేయ్.. మీ ఫొటో చూశారా?” అంటూ లింక్ వచ్చిందా? అది తెలిసిన వ్యక్తి నుంచి వచ్చినా సరే… పొరపాటున కూడా క్లిక్ చేయకండి.
ఇది తాజాగా వెలుగులోకి వచ్చిన ‘ఘోస్ట్ పేయిరింగ్ (Ghost Pairing)’ స్కామ్.
ఈ లింక్‌పై క్లిక్ చేస్తే నకిలీ WhatsApp Web పేజీ ఓపెన్ అవుతుంది. ఓటీపీ లేకుండా, QR స్కాన్ అవసరం లేకుండానే… మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైస్‌తో కనెక్ట్ అవుతుంది.
ఒక్కసారి హ్యాకర్ల చేతికి చిక్కితే
– మీ వ్యక్తిగత చాట్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు
– కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు
– మీ పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపి మోసాలకు పాల్పడతారు
– చివరికి మీ ఖాతాను లాక్ చేసి, మీరు వాడలేని పరిస్థితి తీసుకొస్తారు
🛡️ జాగ్రత్తలు:
✔️ అనుమానాస్పద లింక్‌లను ఎప్పటికీ క్లిక్ చేయవద్దు
✔️ WhatsApp సెట్టింగ్స్‌లో Linked Devices ని తరచూ చెక్ చేయండి
✔️ తెలియని డివైస్ కనిపిస్తే వెంటనే Remove చేయండి
✔️ Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి
🔔 ఒక చిన్న అజాగ్రత్తతో మీ వాట్సాప్ మొత్తం హ్యాకర్ల చేతిలో పడే ప్రమాదం ఉంది.
ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసి అప్రమత్తం చేయండి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
