
AIపై దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవితో సినిమా తెరకెక్కించే అవకాశంపై దర్శకుడు అనిల్ రావిపూడి భావోద్వేగపూరితంగా స్పందించారు. చిన్నతనంలో చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన తనకు, ఇప్పుడు అదే మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి రావడం గర్వకారణమని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదిక X లో పోస్ట్ చేస్తూ, “అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి, ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు. Thanks to AI. ‘AI’ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు” అంటూ వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగిస్తే ఎంత ప్రభావవంతంగా ఉండగలదో ఈ పోస్ట్ ద్వారా తెలియజేశారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు మరియు సినీ వర్గాలు అనిల్ రావిపూడిని అభినందనలు తెలియజేస్తున్నాయి. చిరంజీవి–అనిల్ రావిపూడి కలయికపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
