
ఇండిగో సిబ్బందికి మద్దతుగా సోను సూద్ — “వాళ్లూ భారమే మోస్తున్నారు”
ఇండిగో విమానాల రద్దు, ఆలస్యం వంటి సమస్యలు దేశవ్యాప్తంగా ప్రయాణికులను తీవ్రంగా ఇరికిస్తున్నాయి. ఈ పరిస్థితిపై బాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త సోను సూద్ స్పందించారు.
ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బాధాకరమేనని ఆయన పేర్కొంటూనే, సమస్య పరిష్కారానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ఇండిగో సిబ్బంది పరిస్థితినీ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
“ప్రయాణికులు ఎంత ఒత్తిడిలో ఉన్నారో, ఇండిగో సిబ్బంది కూడా అంతే భారాన్ని మోస్తున్నారు. వాళ్లూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి సిబ్బంది పట్ల సహానుభూతితో, వినయంతో వ్యవహరించండి,” అని సోను సూద్ అన్నారు.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
