
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం
కొండగట్టు స్టేజీ వద్ద శనివారం రాత్రి 11 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జాతర సందర్బంగా ఏర్పాటు చేసిన దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పు అంటుకుని, అందులో ఉన్న భారీ మొత్తంలో బొమ్మలు, సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమ్మక్క–సారలమ్మ జాతర కారణంగా వ్యాపారులు ముందస్తుగా కోట్లు ఖర్చు చేసి స్టాక్‌ను నిల్వ చేసుకున్నారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆస్తి నష్టం రూ. కోట్లల్లో జరిగినట్లు ప్రాథమిక అంచనాలు తెలియజేస్తున్నాయి.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. గాయాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
