
కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఏడు రోజుల చిన్నారిని అమ్మకానికి ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌ను పట్టుకున్నారు. రూ.5 లక్షలకు శిశువును విక్రయించే ప్రయత్నం జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్ఐ అరుణ్ నేతృత్వంలోని బృందం డయల్–100 ద్వారా వేగంగా స్పందించి దాడి చేసింది.
చర్యలో శిశువును సురక్షితంగా రక్షించడంతో పాటు నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
