
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం ఎప్పుడు..?
మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల సమస్యలు సంబంధిత అధికారులకు పట్టవా?
జూలూరుపాడు,అక్టోబర్ 31 (వైరా నియోజకవర్గ జిందగీ 9న్యూస్ రిపోర్టర్: రాము): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతాయో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం కోసం భూమి కేటాయించడమే కాకుండా, శంకుస్థాపన కూడా పూర్తయినప్పటికీ ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు రోజువారీ పనుల నిమిత్తం సెంటర్ పరిధిలో గంటల తరబడి తిరుగుతుండగా, పబ్లిక్ టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే మండల ప్రధాన కార్యాలయంలో ప్రజలకు ఉపయోగపడే పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం ప్రారంభించాలి, లేదంటే ఉద్యమాలు చేపడతామని బానోత్ దుర్గ ప్రసాద్ హెచ్చరించారు.
