
రియాజ్ ఎన్కౌంటర్ – పోలీసులపై దాడి చేయగా కాల్పుల్లో మృతి
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ మరోసారి పోలీసులపై దాడి చేశాడు.
ఆసుపత్రిలో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న పోలీసుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేసిన రియాజ్, పారిపోవడానికి ప్రయత్నించాడు.
ఇప్పటికే నిన్న రియాజ్ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులకు సహకరిస్తున్న ఆసిఫ్ అనే పౌరుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసిఫ్ హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు.
ఈరోజు జరిగిన ఘటనలో రియాజ్ను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు ప్రతిదాడి చేయగా, రియాజ్ గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి, ఐపీఎస్ అధికారికంగా ధృవీకరించారు.
