
జమ్మికుంట రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై ఓ గుర్తు తెలియని పురుషుడు (వయసు సుమారు 65–70 సంవత్సరాలు) అనారోగ్యంతో కింద పడిపోయి మృతిచెందినట్లు సమాచారం. మృతుడు లేత ఆకుపచ్చ రంగు హాఫ్ టీషర్ట్, తెలుపు ధోతి ధరించి ఉండగా, పక్కన చేతి కర్ర కనిపించింది. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేదా వస్తువులు లభించలేదు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు.
ఈ ఘటనపై రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి గురించి ఎవరైనా సమాచారం తెలిసిన వారు ఫోన్ నంబర్లు 9949304574, 8712658604కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
