
ఏన్కూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి మార్కెట్ చైర్మన్ సన్మానం
ఏన్కూర్ , అక్టోబర్ 08 (జిందగీ9న్యూస్ వైరా నియోజకవర్గ రిపోర్టర్ : రాము నాయక్) : ఏన్కూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరామ్ నాయక్ నూతనంగా ఏర్పాటు అయిన ఏన్కూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ధీరావత్ సందీప్ నాయక్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ లచ్చిరామ్ నాయక్ మాట్లాడుతూ — “ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించే విలేకరుల పాత్ర ఎంతో కీలకం. సమాజంలోని వాస్తవాలను అద్దంలా ప్రతిబింబిస్తూ ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న జర్నలిస్టులు మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను” అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, ప్రెస్ క్లబ్ సభ్యులు, స్థానిక విలేకరులు పాల్గొన్నారు.
