
కరీంనగర్లో జాగృతి సమావేశం – కవిత నాయకత్వం అవసరం అని నేతల అభిప్రాయం
కరీంనగర్ జిల్లా హోటల్ తారక హాల్లో జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ అధ్యక్షతన జాగృతి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాగృతి ప్రతినిధులు, యూపీఎఫ్ సభ్యులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఆరంభం నుండి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటులోనూ, అభివృద్ధిలోనూ కవిత పాత్ర విశేషమని, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఆమె నాయకత్వం అవసరమని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత చేసిన కృషిని ప్రస్తావించారు.
జాగృతి అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో జాగృతి సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలకు జాగృతి వేదిక అయిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాగృతి యువజన విభాగం అధ్యక్షుడు విష్ణు, మహిళా విభాగం అధ్యక్షురాలు శివరాణి, జిల్లా నాయకులు డాక్టర్ అరుణ శివరాం, కంజర్ల రేణుక, సంగీత రెడ్డి, మక్కల తిరుపతి, శ్రీరాముల రమేష్, కనకయ్య, గండ్ల చంద్రశేఖర్, రంగరవేణి లక్ష్మణ్, యాసీన్ ఎండి రజి, గుడెల్లి తిరుపతి, పూసాల సదానందం, గర్షకుర్తి విద్యాసాగర్, శివప్రసాద్, కొండ రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
