
జమ్మికుంటలో వైద్య శిబిరాలు
జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కోరపల్లి గ్రామంలో డాక్టర్ బిందు ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ చందు డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 65 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఎనిమిది మంది జ్వరపీకల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కి పంపించారు. రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రామిక వ్యాధుల పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చారు.
ప్రజలకు మలేరియా, డెంగీ, చికెన్ గున్య వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తి విధానం, లక్షణాలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, డ్రైడేలు పాటించాలన్న సందేశాన్ని డాక్టర్ చందు తెలిపారు.
ఇక జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో డాక్టర్ మహోన్నత పటేల్ ఆధ్వర్యంలో మరో వైద్య శిబిరం జరిగింది. చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 32 మందికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో విజయ్‌కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్లు పంజాల ప్రతాప్ గౌడ్, మోహన్‌రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ సదానందం, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎంలు మంజుల, రజిత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
