
లోయర్ మానేరు డ్యామ్ వరద గేట్లు ఈ రోజు సాయంత్రం ఎత్తనున్నారు
కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి వస్తున్న వరద నీరు డ్యామ్‌లోకి చేరుతుండటంతో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (09.09.2025) సాయంత్రం 4 గంటలకు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నేతృత్వంలో స్పిల్‌వే వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
అధికారులు మానేరు నది పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు ఎవరూ మానేరు నదిని దాటే ప్రయత్నం చేయవద్దని ప్రత్యేకంగా హెచ్చరించారు.
