కొండపాకలో తల్లిపాల వారోత్సవాలు

వీణవంక, ఆగస్టు 1 (జిందగీ 9 న్యూస్ – ప్రతినిధి దాట్ల శ్రీనివాస్): వీణవంక మండలం కొండపాక గ్రామంలో అంగన్వాడీ కేంద్రం-1 ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐసిడీఎస్ సూపర్వైజర్ రమాదేవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ –
“బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముద్దు పాలు (కొలస్ట్రమ్) శిశువుకు జీవితాంతం రక్షణ కలిగిస్తాయి. గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన శిశువు జన్మిస్తాడు. ఇందుకు కుటుంబ సభ్యుల సహకారం అవసరం. తల్లులు సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించి రోజూ కనీసం ఒక గంట పాటు పిల్లలతో గడపాలి. తల్లి-బిడ్డల మధ్య బంధం బలపడుతుంది” అని వివరించారు.
ఆరు నెలల వరకూ తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని ఆమె సూచించారు.
డాక్టర్ జయంత్, గ్రామ సెక్రటరీ రేణుక మాట్లాడుతూ – గర్భిణీ దశ నుంచే శిశువుకు తల్లిపాలు అందించేందుకు మాతృదాయిని శారీరక, మానసికంగా సిద్ధంగా ఉంచడం అవసరమన్నారు.
కార్యక్రమంలో గర్భిణీలు, తల్లులు, గోద జమున, బోనాసి రమ్య, కొలుగూరి వరలక్ష్మి, ఏఎన్ఎం రాజేశ్వరి, ఆశా కార్యకర్తలు శారద, జయంత, అంగన్వాడీ టీచర్ మల్లేశ్వరి, ఆయా రాధా తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
