
జమ్మికుంట, జూలై 31(zindagi9news): జమ్మికుంటకు చెందిన గర్భిణీ మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు తెలిపిన రాముల లక్ష్మి వివరాల ప్రకారం — ఆమె చిన్న కూతురు బంకుల జ్యోతి (30), భర్త ఉదయ్ (33)తో కలసి గత 12 సంవత్సరాలుగా జమ్మికుంటలో నివాసముంటోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం జ్యోతి ఎనిమిది నెలల గర్భిణీ కాగా, జూలై 30న సాయంత్రం 5 గంటల సమయంలో తల తిరుగు, కడుపునొప్పితో బాధపడడంతో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బీపీ ఎక్కువగా ఉందని, ఎంజీఎం వరంగల్‌కు రిఫర్ చేశారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ అదే రాత్రి 8 గంటల సమయంలో జ్యోతి మృతి చెందిందని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
