చేప పిల్లల పంపిణీ బదులు డబ్బు జమ చేయాలి: మత్స్య కార్మికుల విజ్ఞప్తి

పెబ్బేరు: మత్స్యకారుల సంక్షేమం కోసం చేపట్టిన చేప పిల్లల పంపిణీ పథకాన్ని మరింత ప్రయోజనదాయకంగా మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. పెబ్బేరు మత్స్య పరిశ్రమ సహకార సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నూతన విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ప్రతి సంవత్సరం చేప పిల్లల పంపిణీ టెండర్ విధానంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని, సదరు కాంట్రాక్టర్లు నాసిరక విత్తనాలను సరఫరా చేస్తున్నారని మత్స్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా విత్తనాలు పెరగక మృతిచెందడం జరుగుతోందని, దీనివల్ల వారి జీవనోపాధి బాగా దెబ్బతింటోందన్నారు.
ఈ నేపథ్యంలో, చేప పిల్లల పంపిణీ బదులు, ఆయా సహకార సంఘాల ఖాతాలలో నేరుగా విత్తనాల కొనుగోలు కోసం ఆర్థిక సహాయం జమ చేయాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పశువర్ధక శాఖ మంత్రి వాకిట శ్రీహరి ముదిరాజ్‌ను కోరారు. తాము నాణ్యమైన విత్తనాలను స్వయంగా కొనుగోలు చేసి అభివృద్ధి సాధించగలమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోనెల బాలస్వామి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చింతకాయల కురుమూర్తి, గోనెల సహదేవుడు, పెద్ద ఎల్లయ్య, చిన్ని ఎల్లయ్య, ఆనంద్, బక్కన్న, తిరుపతయ్య, రంగస్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.
