పెబ్బేరు మండలంలో 133/kv సబ్ స్టేషన్కు స్థలం పరిశీలన
వనపర్తి శాసనసభ్యుడు మేఘా రెడ్డి కృషితో కొత్త అభివృద్ధి చిచ్చు

పెబ్బేరు, జూలై 23 (జిందగీ 9 న్యూస్):
వనపర్తి నియోజకవర్గానికి చెందిన పెబ్బేరు మండలంలో విద్యుత్ విభాగానికి మరింత బలాన్ని చేకూర్చే లక్ష్యంగా 133/kv సబ్ స్టేషన్ మంజూరు కావడం జరిగింది. ఈ సబ్ స్టేషన్ను కంచిరావుపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో, సంబంధిత స్థల పరిశీలన కార్యక్రమం మంగళవారం నిర్వహించబడింది.
శాసనసభ్యుడు మేఘా రెడ్డి ఆదేశాల మేరకు, మండల సర్వేయర్ తో కలిసి 156 సర్వే నంబర్లో ఉన్న భూమిని పరిశీలించారు. స్థలం సబ్ స్టేషన్ ఏర్పాటుకు అనుకూలంగా ఉండటంతో అధికారులు, పార్టీ నాయకులు అక్కడే స్థానం తుది నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో వనపర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, యుగంధర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్, మాజీ డైరెక్టర్ రాములు, గ్రామస్థులు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ అభివృద్ధి చర్య వల్ల మండలానికి నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయం మరియు పరిశ్రమల అభివృద్ధికి దోహదపడనుందని నాయకులు అభిప్రాయపడ్డారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
