జమ్మికుంట మున్సిపాలిటీకి స్వచ్చ్ సర్వేక్షన్లో రాష్ట్రంలో 17వ స్థానం
అభినందించిన సిడిఏంఏ శ్రీదేవి – ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్ మహమ్మద్ అయాజ్

జమ్మికుంట:రాష్ట్రంలోని 143 మున్సిపాలిటీల మధ్య స్వచ్చ్ సర్వేక్షన్-2024లో 17వ స్థానం సాధించిన జమ్మికుంట మున్సిపాలిటీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గతంలో ఇంటి పన్ను వసూళ్లలో రెండు ఆర్థిక సంవత్సరాల పాటు రాష్ట్రంలో మొదటి స్థానం సాధించి అరుదైన ఘనత అందుకున్న జమ్మికుంట, ఇప్పుడు శుభ్రత, పారిశుధ్య పరంగా మరొక అడుగు ముందుకు వేసింది.
ఈ సందర్భంగా సిడిఏంఏ శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్, అధికారులు, సిబ్బందిని అభినందించారు. కమిషనర్ మహమ్మద్ అయాజ్ ప్రకటనలో మాట్లాడుతూ, 2023లో జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్రంలో 92వ స్థానం, దేశవ్యాప్తంగా 1216వ స్థానం పొందిందని, 2024లో రాష్ట్రస్థాయిలో 17వ స్థానం, దేశంలో 217వ స్థానం పొందటం గర్వకారణమన్నారు.
ఈ విజయానికి కారణమైన మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, గత పాలకవర్గ సభ్యులకు, అధికారులకు, సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
