హుజూరాబాద్‌లో మెగా జాబ్ మేళా
70 కంపెనీలు – 3000 ఉద్యోగావకాశాలు
టెన్త్ నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు

జమ్మికుంట, జూలై 20 (జిందగీ9న్యూస్):
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో సోమవారం మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ నాయకుడు బండారి ప్రశాంత్ ఆదివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ మేళాలో 70 కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. మొత్తం 3000 ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ మేళాను ఏర్పాటు చేశారని ప్రశాంత్ తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకాలని, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
“యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు” అని ప్రశాంత్ పేర్కొన్నారు.
