జమ్మికుంటలో గంజాయి ముఠా అరెస్ట్ – నాలుగురు అదుపులో

జమ్మికుంట, జూలై 9 (Zindagi9News): మత్తు మాయలో యువతను పడేస్తున్న గంజాయి ముఠాను జమ్మికుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని FCI గోడౌన్ సమీపంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఆకస్మిక తనఖాలో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.
వారి వద్ద నుండి మొత్తం 15 కిలోల గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.3.75 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో గస్తీ చేపట్టారు. అనుమానాస్పదంగా రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు పారిపోవడానికి యత్నించగా వారిని అదుపులోకి తీసుకుని పరిశీలించగా గంజాయి ఉన్నట్టు నిర్ధారణ అయింది.
https://youtu.be/9HGCnykyUng?si=Updle3ECuqxK_FaX
విచారణలో బయటపడ్డ నిజాలు
వీరు గత ఆరు నెలలుగా గంజాయిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ నుండి గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని కూడా విచారణలో వెల్లడైంది.
నిందితుల వివరాలు
- మోహమ్మద్ అఫ్రీద్ (23) – భీమ్పల్లి (1.4 కిలోలు గంజాయి – రూ.35,000)
- పాశం తరుణ్ (24) – వావిలాలపల్లి (5.055 కిలోలు – రూ.1,26,375)
- జనగాం శశి ప్రీతం (24) – తీగలగుట్టపల్లి (6.380 కిలోలు – రూ.1,59,500)
- బండి పూర్ణచందర్ కుమార్ (23) – కిసాన్ నగర్ (2.165 కిలోలు – రూ.54,125)
మొత్తం విలువ: రూ.3,75,000
ఏసీపీ వి. మాధవి వ్యాఖ్యలు
బుధవారం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ డివిజన్ ఏసీపీ వి. మాధవి మాట్లాడుతూ:
“మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు పాడవుతోంది. మాదక ద్రవ్యాల దందాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు గట్టిగా పనిచేస్తున్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం.”
దాడిలో పాల్గొన్న సిబ్బంది
- ఎస్. రామకృష్ణ – ఇన్స్పెక్టర్
- ఎ. సతీష్ – సబ్ఇన్స్పెక్టర్
- ఎం. యాఖుబ్ – హెడ్ కానిస్టేబుల్
- అబ్దుల్ ఖదీర్, ఆర్. జలేందర్ – కానిస్టేబుళ్లు
పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
