
విశాఖపట్నం: ఏకేఎసీ కాలనీలోని ఎస్సీ బిల్డింగ్స్ వాసులు గత నెల రోజులుగా తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన 40వ వార్డు బీజేపీ అధ్యక్షురాలు మేఘన దుర్గ స్పందించి, స్థానికుల విజ్ఞప్తిని దృష్టిలోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె విశాఖపట్నం బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు, పార్టీ నాయకుడు రవేంద్ర మడపటికి ఈ సమస్యను వివరించారు. అనంతరం నీటి సరఫరా శాఖ అధికారులతో చర్చించి, తక్షణమే పరిష్కారం కల్పించేలా చర్యలు చేపట్టారు.
పార్టీ నాయకుల చొరవతో తాగునీటి సరఫరా పునరుద్ధరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ, సమర్థవంతంగా పరిష్కారం తీసుకువచ్చిన మేఘన దుర్గకు నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
