
వీణవంక, జూన్ 21 (జిందగీ 9 న్యూస్ : ప్రతినిధి దాట్ల శ్రీనివాస్) : కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంలో 154 మందికి ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, ECG పరీక్షలు చేపట్టి రోగ నిర్దారణ చేశారు. ఈ సందర్బంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ….బొంతుపల్లి గ్రామ ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో 24 గంటలు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిభిరంలో ముధిరాజ్ సంఘ అధ్యక్షుడు పోలు ఐలయ్య , పోలు ఉస్మాన్ , కొమురయ్య, కార్తీక్ ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోటకర్ణాకర్, శ్రీకాంత్,సంజీవ్ , తదితరులు పాల్గొన్నారు.

