
హుజురాబాద్, జూన్ 22 (జిందగీ9 న్యూస్ రిపోర్టర్: దిడ్డి రాము, జమ్మికుంట)
హుజురాబాద్ పట్టణంలో శనివారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణా తరగతులు ఘనంగా జరిగాయి. ఉదయం 9:30 గంటల నుంచి 11:00 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములు లభించాయి. గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల పాఠశాల, కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కాకతీయ పాఠశాల, విజ్ఞాన్ హై స్కూల్, జూనియర్ కళాశాలల నుండి సుమారు 500 మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి పాల్గొన్నారు.
యోగా గురువు చల్లూరి శ్రీధర్ మరియు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, త్రికోణాసనం, వృక్షాసనం, బస్మిక కపాలభాతి, అనులోమ-విలోమ తదితర ఆసనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యోగా వల్ల మానసిక ఉల్లాసం, వికాసం, దైహిక ఆరోగ్యం అభివృద్ధి చెందుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్ యతిపతి అరుణ్ కుమార్, సభ్యులు యతిపతి నిరంజన్ కుమార్, డాక్టర్ దివిటి అంజనీదేవి, డా. పల్లె నారాయణరెడ్డి, అక్కినేపల్లి శ్రవణ్, చిదురాల శ్రీనివాస్, చెరుకుపల్లి శ్రీవాణి పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా హుజురాబాద్ డిప్యూటీ డిఎం హెచ్ ఓ చందు, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డి.ఎం. శోభారాణి, సమ్మిరెడ్డి, మానస, ఆంజనేయరావు, సతీష్, తిరుమల, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
