
వీణవంక, జూన్ 2 (జిందగీ9న్యూస్ ప్రతినిధి – దాట్ల శ్రీనివాస్): కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం వీణవంక మండలంలోని కొండపాక గ్రామంలో మున్నూరు కాపు కులస్తుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో సుమారు 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి రోగనిర్ధారణ చేశారు.
ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ, “మున్నూరు కాపు కులస్తులే కాకుండా కొండపాక గ్రామ ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని” తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కాసర్ల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు దాట్ల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ పెద్దపల్లి రాజయ్య, సంఘం డైరెక్టర్లు, మెడికవర్ ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, సంజీవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
