
పెబ్బేరు , మే 25 (zindagi9news):పెబ్బేరు మండలంలోని చెలిమిళ్ల గ్రామంలోని కల్లాల్లో ఈ మధ్య చోటుచేసుకున్న దృశ్యం హృదయవిదారకంగా మారింది. వడ్లను సకాలంలో కొనకపోవడంతో ఇంకా కల్లాల్లోనే వరి ధాన్యం నిల్వ ఉండిపోయింది. ఈ నేపథ్యంలో వర్షం పడటంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
గత రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు ధాన్యం కోత ముగించి సెంటర్లకు తీసుకెళ్లే దశలో ఉండగా, ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేయడంతో ధాన్యం పాడవుతోంది. “ధాన్యం సకాలంలో తీసుకోకపోగా, కనీసం కవర్లు కూడా ఇవ్వలేదని” రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితులపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు, మండల అధ్యక్షులు వనం రాములు ఆధ్వర్యంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలన చేశారు. రైతుల సమస్యలను వినిపించి, అధికారులతో చర్చలు జరిపారు.
రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం… చేతికి రాకముందే తడిసిపోయింది” అంటూ రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. వెంటనే కొనుగోలు చేపట్టాలని వారు సెంటర్ నిర్వాహకులు మరియు అధికారులను కోరుతున్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో BRS పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు పెద్దింటి వెంకటేష్, వడ్డే ఈశ్వర్ సాయి రామకృష్ణ, వేణు విశ్వరూపం (సోషల్ మీడియా కన్వీనర్), వడ్డె రమేష్, నాగిరెడ్డి, మోహన్, మధు, మొగులయ్య, మూర్తి, వీరస్వామి, రఘు, మల్లికార్జున, కొండల్, ఓంకారీ, హర్షవర్ధన్, వేణు, తదితరులు పాల్గొన్నారు.
