
హుజురాబాద్, మే 16(zindagi9news): పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నందు విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ కార్డులు పంపిణీ చేశారు.
ఈ కార్డుల్లో కార్మికుల ఆరోగ్య వివరాలు, అనారోగ్య లక్షణాలు, వాడే మందులు తదితర సమాచారం సమగ్రంగా లభ్యమవుతుంది. ఈ కార్డు పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరిరక్షణలో ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య తెలిపారు. కార్మికుల ఆరోగ్యం బాగుండటం వల్ల పట్టణ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండగలరని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ DM&HO డా. చందు, RMO డా. సుధాకర్ రావు, డాక్టర్లు డా. ప్రసాద్, డా. రమేష్, డా. జరీనా తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, పోలు వినయ్, రామగిరి బాలగంగాధర్ తిలక్, అరకాల వెంకటరమణ, నూనె రమేష్, శీలం అనుష, మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ జవాన్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
