
హుజూరాబాద్, మే 15 (zindagi9news): వంటగ్యాస్ వాడకందారులకు నాణ్యమైన సేవలు అందించినప్పుడే వారు సంస్థతో వ్యాపార అనుబంధాన్ని కొనసాగిస్తారని అంబుజా గ్యాస్ ఏజెన్సీ మేనేజింగ్ పార్టనర్, తెలంగాణ గ్యాస్ డీలర్ల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పి.వి. మదన్ మోహన్ అన్నారు.
హుజూరాబాద్‌లోని అంబుజా గ్యాస్ ఏజెన్సీ ప్రాంగణంలో గురువారం జరిగిన 36వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1989 మే 15న ప్రారంభమైన సంస్థ, మూడు పుష్కరాల కాలంలో సుమారు 26,000 ఇండేన్ కస్టమర్లకు సేవలందించే స్థాయికి ఎదిగిందని తెలిపారు.
కస్టమర్ల విభిన్న అవసరాలను, సమస్యల్ని అధిగమిస్తూ సంస్థ ముందుకు సాగిందని వివరించారు. గ్యాస్ డెలివరీలో భద్రతకు ప్రాధాన్యతనిచ్చామని, సిలిండర్ పంపిణీకి ముందు పిడిసి తనికీలు నిర్వహించటమే కాక, రింగులలో లోపాలు గుర్తించగలమన్నారు.
ప్రభుత్వ పిలుపు మేరకు గత ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు బేసిక్ సేఫ్టీ చెక్ కార్యక్రమాలు నిర్వహించామని, వాటిలో లీకేజ్ సమయంలో టోల్ ఫ్రీ నంబర్ 1906 వినియోగంపై అవగాహన కల్పించామని వివరించారు.
కస్టమర్లు సబ్సిడీ పొందాలంటే eKYC తప్పనిసరిగా చేయాలన్నారు. నాణ్యమైన రబ్బరు ట్యూబులు ఉపయోగించనిచేత ప్రమాద భీమా రాదని, ఆయిల్ కంపెనీలు ఐదు సంవత్సరాల వాడుకకు పనికొచ్చే సురక్షిత ట్యూబులు అందుబాటులోకి తెచ్చాయని తెలిపారు.
కస్టమర్లు ఓటిపి చెప్పిన తర్వాతే సిలిండర్ డెలివరీ చేస్తున్నామన్నారు. రీఫిల్ కోసం వాట్సాప్ నంబర్ 8454955555 ఉపయోగించాలని సూచించారు. వంట తర్వాత స్టవ్ నాబ్ ఆఫ్ చేయడం, గాలి ఆవిరి బైటికి వెళ్లేలా వాతావరణాన్ని రూపొందించడం, ఫ్లాట్‌ఫామ్‌పై వంట చేయడం వంటి భద్రతా చర్యలు పాటించాలన్నారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ₹1400 కి పైగా ఉన్న సిలిండర్‌ను సంస్థ కేవలం ₹920కి అందిస్తున్నదని, అవసరాన్ని బట్టి వినియోగించాలని సూచించారు.
కార్యక్రమంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సిబ్బందిని కండువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో మేనేజర్ దేవేందర్ రెడ్డి, సీనియర్ కస్టమర్లు గోపాల్ రెడ్డి, కరాటే రమేష్, సుధాకర్ రెడ్డి, సిబ్బంది పవన్, శరత్, భరత్, భరత్ రెడ్డి, సరిత, కనుకయ్య, భాస్కర్, సురేశ్, ప్రభు, దామోదర్, ప్రశాంత్, కుమార్, సాగర్, నర్సయ్య, రాంబాబు, సీను, రాజు, హరిష్, కమలాకర్, అనీల్, సురేశ్, ప్రేమ్ చిన్న, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
