
జమ్మికుంట, మే 14 (zindagi9news ):కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం రోజున ఉదయం 5:30 సమయంలో దొంగతన ఘటన చోటు చేసుకుంది. ఇంజమూరి వెంకట సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆయన తల్లి ఇంజమూరి వెంకటలక్ష్మి (85) ఇంటి బయటకు వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి “తాత ఉన్నారా?” అని అడిగాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న తులం బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. దాని విలువ రూ.35,000గా అంచనా. ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
