పెబ్బేరు , మే 3 (zindagi9news): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణకు సంబంధించిన విధి, విధానాలను అధికారికంగా ప్రకటించే ముందు దేశంలో ఉన్న బీసీ మేధావులను, బీసీ ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసి వారి యొక్క ముఖ్యమైన సూచనలను తీసుకొని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎస్. రామన్ గౌడ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా దేశంలో ఉన్న బీసీలను కులాలవారీగా, ఉప కులాల వారీగా, షరతులు పెట్టకుండ లెక్కించాలి.
కేంద్ర ప్రభుత్వం లెక్కించే కులగణన మీదనే బీసీల భవిష్యత్తు ఆధారపడి ఉంది కావున విద్య, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ రంగాలలో వారి యొక్క వాటా వారికీ చెందాలంటే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కులగణనను లెక్కించాలి. దేశంలో అనధికారికంగా బీసీలు 60 శాతం పైగా బిసి జనాభా ఉంది. కేంద్ర ప్రభుత్వం లెక్కించే బీసీ జనాభా లెక్కల లో కనీసం 60 శాతం జనాభా లెక్కలు తెలకుంటే కేంద్ర ప్రభుత్వం తప్పుడు కుల గణన సర్వేగా యావత్ బిసి సమాజానికి అనుమానం కలుగుతుందని రామన్ గౌడ్ అన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
