ఖమ్మం, మే 3 (Zindagi9News ): ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన అపర మేధావి డాక్టర్ దివ్యమూర్తికి కాకినాడకు చెందిన రావ్ మెమోరియల్ ఆర్గనైజేషన్ వారు డాక్టర్ దివ్య మూర్తి ప్రతిభను గుర్తించి అతనికి విద్యారత్న అవార్డును ఇవ్వడం జరిగింది.ఈ అవార్డును డాక్టర్ దివ్యమూర్తి కోదాడ ఎమ్మార్వో కార్యాలయంలో కోదాడ ఎమ్మార్వో మహమ్మద్ వాజిద్ అలీ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. తదనంతరం ఎమ్మార్వో డాక్టర్ దివ్యమూర్తిని శాలువాతో ఘనంగా సన్మానించారు. డాక్టర్ దివ్యమూర్తి లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని ఎమ్మార్వో తెలియజేశారు. ఈ అవార్డు రావడం తనకు సంతోషంగా ఉందని డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు.ఇప్పటివరకు 59 అవార్డులు వచ్చాయని 104 చోట్ల సన్మానం జరిగిందని డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ తహసిల్దార్ సిబ్బంది, డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
