ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులతో ప్రభంజనం
హుజురాబాద్: మంగళవారం రోజున విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో హుజరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనతో ప్రభంజనం సృష్టించారు. కళాశాల స్థాపన నుండి ఈవేళ వరకు ఎన్నడూ చూడని రీతిలో ఎంపీసీ, బైపిసి, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులలో రాష్ట్రస్థాయి మార్కులతో విజయాన్ని అందుకున్నారు.
మొదటి సంవత్సరం విశేషాలు:
ఎంపీసీ:
కె. అభిరామ్ – 463/470 (తండ్రి గణేష్, పోస్టుమాస్టర్ మల్యాల, ఇల్లంతకుంట)
బి. శ్రావణి – 446/470
పి. అభిరామ్ – 443/470
ఆర్. వర్షిత – 416/470
బైపిసి:
జే. మాధవి – 379/440 (తండ్రి మనోజ్, వ్యవసాయ కుటుంబం, సిర్సపల్లి)
సీఈసీ:
పి. అర్చన – 386/500
హెచ్ఈసీ:
టి. అఖిల – 400/500 (తండ్రి భిక్షపతి, వ్యవసాయ కుటుంబం, చిన్న పాపయ్యపల్లె)
ద్వితీయ సంవత్సరం విజయాలు:
ఎంపీసీ:
కె. సిరి చందన – 879/1000 (తండ్రి అంజనీ కుమార్, హుజురాబాద్)
బైపిసి:
జార మరియం – 873/1000 (తండ్రి మరణించారు, తల్లి రోజు వారి కూలీ, హుజురాబాద్)
హెచ్ఈసీ:
ఎం. రాం చరణ్ – 928/1000 (తండ్రి రాజు, ఆటో డ్రైవర్, చెల్పూర్)
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వి. ఆంజనేయ రావు మాట్లాడుతూ, అత్యున్నత ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. కళాశాల నిఖార్సైన శిక్షణ మరియు అధ్యాపకుల అంకిత భావం ఫలితంగా ఈ విజయాలు సాధ్యమైనాయని తెలిపారు. మొదటి సంవత్సరం 40% మరియు ద్వితీయ సంవత్సరం 42% ఉత్తీర్ణత శాతం నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
కళాశాల అధ్యాపకులు కూడా విజేత విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలు ప్రభుత్వ విద్యా రంగంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాముఖ్యతను మరింత పెంచాయని వారు వ్యాఖ్యానించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
