పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో సంఘటన స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
హుజూరాబాద్ మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో వడగాలులతో ఒక నిరుపేద కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. గుండేటి సరిత-శివ దంపతుల నివాసం పై ఉన్న రేకుల షెడ్డు గాలి వానకు పూర్తిగా కూలిపోయింది. కుటుంబానికి తాత్కాలిక నివాస సౌకర్యం లేకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అక్కడికి పంపించారు. నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితురాలైన గుండేటి సరితతో వోడితల ప్రణవ్ ఫోన్లో మాట్లాడించారు.
సరిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న వోడితల ప్రణవ్, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. అలాగే తాత్కాలికంగా అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సరిత కుటుంబం వోడితల ప్రణవ్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుల్ల రాధ, నాయకులు ఉమాపతి రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ యండి చాంద్ పాషా, బండారి సదానందం, సమ్మెట సంపత్, సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు పోషు రాజమౌళి, ఇంద్రసేనారెడ్డి, కృష్ణమూర్తి, తలకొక్కుల రవి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
