ఔషధాలను చర్మంలోకి పంపే విధానంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అమెరికాకు చెందిన ‘ఇంటెగ్రి మెడికల్’ సంస్థ తాజాగా “ఎన్-ఫిస్” (EnFuse) అనే సూది లేని ఇంజెక్షన్ పరికరాన్ని పరిచయం చేసింది. ఇది మందును అధిక వేగంతో చర్మంపై ఉన్న సూక్ష్మ రంధ్రాల్లోకి జొప్పించి, నొప్పి లేకుండా కండరాల్లోకి చేరుస్తుంది.
సూది భయంతో ఇంజెక్షన్లను నివారించే వారి కోసం ఇది ఉత్తమ ప్రత్యామ్నాయమని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఈ పరికరాన్ని దేశవ్యాప్తంగా వెయ్యిమంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నట్లు ఇంటెగ్రి మెడికల్ వెల్లడించింది. త్వరలోనే ఇది విస్తృతంగా అందుబాటులోకి రానుంది.
