జమ్మికుంట: బుధవారం జమ్మికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫంక్షన్ హాల్ నుంచి బైక్‌పై తిరిగి వస్తున్న వ్యక్తి ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళితే… జమ్మికుంట పట్టణానికి చెందిన పెరుమండ్ల సుధాకర్ (42), బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు దినేష్ ఫంక్షన్ హాల్‌కు వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం హుజురాబాద్ రోడ్ ద్వారా జమ్మికుంటకు తన బైక్ (హీరో హోండా షైన్)పై తిరిగి వస్తుండగా, బజాజ్ షోరూమ్ సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ (TS 22 T 7909) అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ ఓవర్టేక్ చేయబోయి, సుధాకర్‌ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో సుధాకర్ ట్రాక్టర్ టైర్ కింద పడిపోవడంతో తలకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి అక్క కందుల సరోజన జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
