నవీపేట్ మండల కేంద్రంలో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఎస్సార్ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు హాజరై మాట్లాడారు. మహారాష్ట్ర లో1927 ఏప్రిల్ 11న జన్మించి చదువుపై మక్కువతో చదువుకునేందుకు వెళ్లగా బ్రాహ్మణ వ్యవస్థ అతని చదువుకు ఆటంకం కలిగించిందని అన్నారు. తండ్రి గోవిందరావ్ పూణేలో చదువుకున్నాడు అగ్రవర్ణ బ్రాహ్మణులు హేళన చేసిన విద్యకు దూరం కాకుండా కష్టపడి చదివి చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకొని ఆమె చదువును సైతం ప్రోత్సహించి ప్రపంచంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా 170 సంవత్సరాల క్రితమే విద్య హక్కు గురించి కృషి చేశారు. అంతేకాకుండా అనాధ పిల్లలను చేరదీసి పాఠశాలలో చేర్పించారు బడుగు బలహీన వర్గాల గో విద్య అందించేందుకు తాపత్రయపడ్డారు. కాబట్టి ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్, జంగం గంగాధర్, మేకల ఆంజనేయులు, దేవేందర్ సింగ్, రమాదేవి, మహబూబ్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
