ముక్కా వారి పల్లి, ఏప్రిల్ 11:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామపంచాయతీకి చెందిన కుప్పం కుటుంబం జీవనజ్యోతి ఆనంద నిలయంలో భక్తిపూర్వకంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.కుప్పం జయరామయ్య–చిన్నక్క దంపతుల కుమారుడు కుప్పం చెంచు రామయ్య, ఆయన సతీమణి కుప్పం చిన్న నరసమ్మ మరియు వారి కుమారుడు కుప్పం సుబ్రహ్మణ్యం, కుమార్తె కుప్పం సునీత ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో చేపట్టారు.ఉదయం ప్రారంభమైన ఈ మహా అన్నదానంలో వృద్ధులు, దివ్యాంగులు, బాల బాలికలు, బాటచారులకు ఇడ్లీ, వడ, పొంగలి, పుల్కా అన్నం, కేసరి, సాంబార్, చట్నీ, సేమియా ఉప్మా, మిక్సింగ్ పొడి వంటి తొమ్మిది రకాల భోజనాలు వడ్డించారు. ఈ విందును జీవనజ్యోతి ఆనంద నిలయం ఫుడ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పుల్లగంటి సిద్ధమ్మ మరియు మేనేజర్ రఘురామయ్య సమన్వయంతో నిర్వహించారు.మధ్యాహ్న భోజనంగా కలర్ రైస్, సాంబార్, కుర్మా, వైట్ రైస్, పెరుగు, చట్నీ, గోంగూర, రసం వంటివి స్వయంగా కుప్పం కుటుంబ సభ్యులే వడ్డించారు. సాయంత్రం అందరికీ అల్పాహార భోజనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కుప్పం చెంచు రామయ్య-చిన్న నరసమ్మ దంపతుల కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ముక్కోటి దేవతల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.జీవనజ్యోతి ఆనంద నిలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసి, పుట్టినరోజులు, పెళ్లిరోజులు లేదా ఇతర శుభకార్యాల సందర్భంగా అన్నదానం చేయదలచిన దాతలు ఒక వారం ముందు ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు:97031 05755, 73861 01853, 85010 05384, 94408 83354.
