హనుమకొండ జిల్లా (కేయు ), జిందగీ 9న్యూస్ : హనుమకొండ జిల్లా లోని కాకతీయ యూనివర్సిటీ ఎస్ డి ఎల్ సి సెంటర్లో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎల్ హెచ్ పి ఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర వెంకట్ నాయక్ మాట్లాడుతూ,మహాత్మ జ్యోతిరావు పూలే అంటరానితనాన్ని ఎండగట్టి, సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి అణగారిన బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవ హక్కులకై ఉద్యమించిన సామాజిక విప్లవకారుడు, నిరంతరం మహిళల విద్యాభివృద్ధికై పాటుపడిన ఆదర్శప్రాయుడు, సమ సమాజ స్థాపనలో భావి తరాలకు నిత్య స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.జ్యోతిరావు పూలే సేవలను నిరంతరం స్మరించుకుంటూ సమాజంలో ముందుకు సాగాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాంకుడోత్ అశోక్ నాయక్ భూక్యా నరేష్ శ్రీనివాస్ నాయక్ గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
