పెబ్బేరు, Zindagi9News:పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలలో గురువారం పోషన్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వనపర్తి జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి మాట్లాడుతూ, గర్భిణీలు మరియు బాలింతలు పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమని చెప్పారు.అవసరమైన పోషక విలువలపై అవగాహన కల్పించడంతో పాటు, రక్తహీనత నివారణ, పరిశుభ్రత పాటించే విధానం – ముఖ్యంగా చేతులు కడుక్కోవడం వంటి విషయాలపై శిక్షణ ఇచ్చారు. అలాగే తల్లులకి ప్రీ-స్కూల్ కార్యక్రమాల గురించి వివరించి, ఓ చిన్నారికి అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సీడీపీఓ బాలేశ్వరి, ఏసీడీపీఓ ఝాన్సీ లక్ష్మి, సూపర్వైజర్ వినోద, ఎంఎల్హెచ్పీ వినీలా, ఏఎన్ఎం శివకుమారి, అంగన్వాడి టీచర్లు నర్మదా, రాధా, లలిత, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
